Wednesday 24 January 2018

Kreestu Prabhuni Yaajakuniga

క్రీస్తు ప్రభుని యాజకునిగ

పల్లవి:          క్రీస్తు ప్రభుని యాజకునిగ దైవ ప్రజల సేవకునిగ
                   నిత్యరాజ్య వ్యాపకునిగ నన్ను పిలిచి బ్రోచుదేవా
                   అంకితం నీకే జీవితం అర్పితం నాదు సర్వస్వం

1.            ఇలలోన చాటింతు నీ నామమున్ మహిలోన స్థాపించు కల్వరియాగం
ప్రభు సేవే నా కర్తవ్యము ప్రభు పూజే మా సంతోషము ||2||
అంకితం నీకే జీవితం అర్పితం నాదు సర్వస్వం

2.             నా కర్హతేది నీ సన్నిధి నిలువ నీ పాద సేవకై నను పిలిచావు
నా తల్లి గర్భాన్నే ఎన్నుకున్నావు నీ ప్రేమను వర్ణింప తరమా ||2||
             అంకితం నీకే జీవితం అర్పితం నాదు సర్వస్వం

Ee Shubha Vela Ee Pooja Vela

ఈ శుభ వేళ ఈ పూజ వేళ


పల్లవి:     ఈ శుభ వేళ ఈ పూజ వేళ సంతస మొందే వేళ
                   మనసులు పొంగే వేళ  ||2||

1.             ప్రియమార మమ్ముల పిలిచావు స్వామి
         ముదమార మమ్ముల మలిచావు స్వామి ||2||
నీ పలుకే మమ్ము నడిపించ లేదా
నీ కరుణతో మేము తరియించలేమా    ||2|| ||ఈ||

2.            సుఖ సంపదలను కూర్చావు స్వామి
        కలిమి లేములలో నిలిచావు స్వామి    ||2||
             కాపరివై మమ్ము కాపాడినావు
             మేపరివై మమ్ము దరి చేర్చరావా        ||2|| ||ఈ||

Ihaparaalanu Srujiyinchina Tandridevaa

ఇహపరాలను సృజియించిన తండ్రిదేవా


సాకి:         ఇహపరాలను సృజియించిన తండ్రిదేవా... వందనం
                   ఇహములోన జనియించిన యేసుదేవా... వందనం
                   బహువరాలు కురిపించు ఆత్మదేవా... వందనం
                   త్రియేక దేవా వందనం స్వాగతం తండ్రీ 
                 ఘనస్వాగతం... ప్రభువా స్వాగతం...

పల్లవి:       దిగిరండి దివినుండి భువిలోన వసియించండి ||2||
                   దైవవాక్కు (క్రీస్తుజ్యోతి) ఆలయములో ప్రేమజ్యోతియై నిలవండి||2||
                   అందుకొనుమో తండ్రీ మా అంజలి నిరంతరం
                   స్వాగతం ఘనస్వాగతం ప్రభువా స్వాగతం

                   గామపసారి పగామప గామపాసారిపగారిసా
 1.              నీ మందిరమెంతో సుందరం ఈ మందిరమంతా నీ జనం ||2||
స్తుతి స్తోత్రాలు చెల్లించుటకై గుమి కూడిన ఈ శుభదినం ||2||
అందుకొనుమో తండ్రీ మా అంజలి నిరంతరం
స్వాగతం ఘనస్వాగతం ప్రభువా స్వాగతం

              సగగగాసని సాగమసా పసనిసారీప మపమగా
2.              నీ కృపతో కట్టిన ఈ ఆలయం నీ కృపతో నిండిన ఆశయం ||2||
వినిపింతు దేవా మా విన్నపాలు కరుణించు దేవా కరుణతో ||2||
అందుకొనుమో తండ్రీ మా అంజలి నిరంతరం
స్వాగతం ఘనస్వాగతం ప్రభువా స్వాగతం

Idi Poojaa Samayam Manakosagina

ఇది పూజా సమయం మనకొసగిన

పల్లవి:        ఇది పూజా సమయం మనకొసగిన అభయం
రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం
మన మనసుకు సేదదీర్చు సమయమిదే
రండి పాల్గొందము రండి రక్షణ పొందుదము ||2||

1.               పరిపూర్ణతతో ప్రభు ఒసగిన బలి
          పరివర్తన కలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి  ||2||
ఈ బలియందే కలదు దైవబలం
ఇదియే మనకు జన్మ ఫలం                          ||2|| ||రండి||

2.             పసిడి వాక్కులో ప్రభవించిన బలి
         ప్రతి నిత్యం వెలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి ||2||
             ఈ బలియందే కలదు ప్రేమవరం
             ఇదియే మనకు జన్మ ఫలం                           ||2|| ||రండి||

AAlaya Gantalu Prabhaatharaagamaalapinchagaa

ఆలయ గంటలు ప్రభాతరాగమాలపించగా

పల్లవి:         ఆలయ గంటలు ప్రభాతరాగమాలపించగా
అరుదెంచినాము స్వామి నీ సన్నిధికీ ఆదరించి ఆదుకొనుమా
ఆత్మ దైవమా అనురాగ హృదయముతో దీవించుమా

1.            పరవశాన పుడమి నిను పూజింపగా
         పరిమళ సుమ గంధాలను విరజిమ్మగా
పులకిత ఆమని ఇల పల్లవించగా
ప్రార్థించగ వచ్చినాము మా ప్రాణదీపమా!

     2.    సుందరమగు మందిరాన చేరి అందరం
             నిర్మలమగు డెందములనె అర్పించెదం

Thursday 18 January 2018

Aalayamlo Praveshinchandi Andaru

Aalayamlo Praveshinchandi Andaru


పల్లవి:     ఆలయంలో ప్రవేశించండి అందరూ
               స్వాగతం సుస్వాగతం యేసునామంలో
మీ బ్రతుకులో పాపమా కలతలా - మీ హృదయంలో బాధలా కన్నీరా
మీ కన్నీరంతా తిడిచి వేయు రాజు యేసు కోసం

1.             దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై - వెదకే వారికంతా కనబడు దీపము
యేసురాజు మాటలే వినుట ధన్యము
         వినుట వలన విశ్వాసం అధికమధికము
ఆత్మలో దాహము తీరెను రారండి
         ఆనందమనందం హల్లెలూయా                ||ఆలయంలో||

     2.     ప్రభు యేసు మాటలే పెదవిలోమాటలై - జీవ వృక్షంబుగా ఫలియించాలని
              పెదవితో పలికెదం మంచి మాటలే
              హృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలై
              నింపెదం నిండెదం కోరేదం పొందెదం
              ఆనదంమానదం హల్లెలూయ                  ||ఆలయంలో||

Wednesday 17 January 2018

Aalayagantalu mroginavi

Aalayagantalu mroginavi


పల్లవి:      ఆలయ గంటలు మ్రోగినవి తరలిరండి జనులారా
                 ప్రభు పూజలో పాల్గొనగా దొరకునెంతో సంపద ||2||
                 తరలిరండి జనులారా వేగమే రండి ప్రజలారా
                 ప్రభు దీవెన పొందెదము ||2||

1.            ఆనందముతో అనురాగముతో పరమభాగ్యము  పొందెదము ||2||
సుధలు చిందే మధుర బలిని ఆదరముతో
పొందెదము తరలి రండి జనులారా
వేగమే రండి ప్రజలారా ప్రభు దీవెన పొందెదము ||2||

2.            గానము చేయుచు కదలుడి గమ్యము అదియే గాంచుడి ||2||
ఆయన స్వరమే నేను వినగా తలపులు తెరువబడెను ||2||
             వేగమే రండి ప్రజలారా ప్రభు దీవెన పొందెదము ||2||

Archana Samayam aasanamaaye

Archana Samayam aasanamaaye


    అర్చన సమయం ఆసనమాయే ఆర్తితోడ ఆరాధించగరారే
    రండి తరలిరండీ జనమా దైవాన్ని కొలువగ రండి   ||2||

1. నేనే సత్యం జీవం అని పలికే యేసుని కనరారే ||2||
     సత్యానితుని రూపం చూడరే దైవ తనయుని మహిమను కాంచరే ||2|| 
||అర్చన||

2. యేసే జీవన మార్గం మము నడిపే దైవ తనయుని ||2||
     కరుణామయుని రూపం చూడరే దైవతనయుని మహిమను పొగడరే ||2|| 
||అర్చన||

3. మదిలో మెదిలే భావం మన ప్రభుతో ఏకం చేయరే ||2||
     ప్రేమమయుని రూపం చూడరే దైవతనయుని మహిమను కాంచరే ||2|| 
||అర్చన||