Saturday 17 February 2018

Nuvvuleni Naa Jeevitham Naa Yesayyaa Song Lyrics

నువ్వులేని నా జీవితం నా యేసయ్యా

పల్లవి:        నువ్వులేని నా జీవితం నా యేసయ్యా – దారం తెగిన గాలి పటం
              నువ్వులేని నా జీవితం నా యేసయ్యా – గమ్యము లేని గాలి పటం
              రావయ్యా నా యేసయ్యా – నా చేయి పట్టి నడిపించవా
              నా మార్గము నీవై – నా గమ్యము నీవై నను నీవు నడిపించవా
              నువ్వులేని నా జీవితం నా యేసయ్యా – దారం తెగిన గాలి పటం

1.               నది సంద్రములో నడచిన దేవా – గాలి తుఫానును అణచిన దేవా
నా లోని విశ్వాసము బాల పరచవా ||2||
కరుణతో కరుణించి కాపాడవా కరుణామయా
నువ్వులేని నా జీవితం నా యేసయ్యా
గమ్యము లేని గాలి పటం ||నువ్వు||

2.            ప్రార్థనచేయుట నేర్పిన దేవా రక్త చెమటలతో ప్రార్ధించితివా
       నా ప్రార్ధనను బలపరచవా ||2||
      దయతో దీవించి దరిచేర్చవా – దయామయా |నువ్వు|

Neevu Ganaka Lekapote Song Lyrics

నీవు గనక లేకపోతే

పల్లవి:        నీవు గనక లేకపోతే – నా బ్రతుకంతా శూన్యమయ్యా
              యేసయ్యా యేసయ్యా – యేసయ్యా యేసయ్యా ||2||

1.             నా జీవిత నావలో నాపడవ ప్రయాణంలో నీవు గనక లేకపోతే
నా హృదయ వేదనలో నా ఆఖరి శ్వాసలో – నీవు గనక లేకపోతే ||2||
అంతా శూన్యం బ్రతుకంతా శూన్యం నా చేయి పట్టి నడిపించరావయ్య
యేసయ్యా యేసయ్యా – యేసయ్యా యేసయ్యా ||2||

2.            ఈలోక సంపదలు నేను కలిగినా నీవు గనక లేకపోతే
ఎన్నెన్నో పధకాలు నేను వేసినా నీవు గనక లేకపోతే ||2||
అంతా శూన్యం బ్రతుకంతా శూన్యం నా చేయి పట్టి నడిపించరావయ్య
యేసయ్యా యేసయ్యా – యేసయ్యా యేసయ్యా ||2||

Nee Rekkala Maatuna Odagaalani Song Lyrics

నీ రెక్కల మాటున ఒదగాలని

పల్లవి:        నీ రెక్కల మాటున ఒదగాలని – నీ చక్కని బాటలో నడవాలని ||2||
              ఆశపడిన నాకు పాపమడ్డు పడెను ||2||
              కాపరివై కాపాడవా మేపరివై నను కరుణించవా ||2|| ||నీ||

1.              నీ ప్రేమనే మరచి నిను వీడిపోయాను
       ఈ లోక ఆశలకు నేలోంగి పోయాను ||2||
       నడి సంద్ర సుడిలోన నావికుడనయ్యాను – దరి చేర్చవా ||2|| ||నీ||

2.             నీ చెలిమితో బలిమి కోల్పోయాను
       దరిరాక దూరంగా నే వెళ్ళిపోయాను ||2||
       నువులేని వేళ తిరిగి వెను దిరిగిగాను
       కరుణించవా నన్ను క్షమియించవా ||2|| ||నీ||

Nee Neethilo Nenu NIlavaalani Song Lyrics

నీ నీతిలో నేను నిలవాలని

పల్లవి:        నీ నీతిలో నేను నిలవాలని – నీ ప్రేమలో నేను ఎదగాలని
              ఆశించాను ఆత్మ స్వరూప – కరుణించవా కలుషాపహరణ ||2||

1.              మరణాంధ కారములో నివసించిన నన్ను
       నీ ప్రేమ హస్తముతో బ్రతికించినావు
       నీ ద్రాక్ష తోటలో ద్రాక్షవల్లిగా ఫలియింప
       చేయుమా జీవాత్మ ఫలమా ||2|| ||నీ||

2.            సాతాను శోధనలో విడిపించినావు
       సంపూర్ణ స్వస్థతను దయచేసినావు
       ఎనలేని నీ ప్రేమకేమివ్వగలను
       ప్రతిచోట సాక్షిగా చాటెద ప్రభువా ||2|| ||నీ||

Neethodunu Nirathamu Pondaalani Song Lyrics

నీతోడును నిరతము పొందాలని

పల్లవి:        నీతోడును నిరతము పొందాలని అ... అ... అ...
              నీ చల్లని నీడలో బ్రతకాలని – ఆశపడిన నేను వీడిపోతిని ||2||
              కావుమయ్యా యేసయ్యా – బ్రోవుమయా మెస్సయ్యా ||2|| ||నీతోడు||

1.               ఎదుటి వాని ఎదుగుదలను – క్షణమైన ఓర్వనైతినీ ||2||
అవివేకపు బాషలతో అల్పులను గేలి చేసితి ||2||
నిజము తెలిసి నిన్ను ఎరిగి నీ సన్నిధి చేరితిని ||2||
కావుమయ్యా యేసయ్యా – బ్రోవుమయా మెస్సయ్యా ||2|| ||నీతోడు||

2.              నీ రూపుకు ప్రతి రూపం సోదరుడని నే మరచితిని ||2||
దూషించితి ద్వేషించితి దయచూడనైతిని ||2||
తప్పుతెలిసి క్షమను ఎరిగి నిన్నె నమ్మి వచ్చితిని ||2||
కావుమయ్యా యేసయ్యా – బ్రోవుమయా మెస్సయ్యా ||2|| ||నీతోడు||

Nee Kanti Paapa Nenayaa Song Lyrics

నీ కంటి పాప నేనయా

పల్లవి:        నీ కంటి పాప నేనేయా – నీ గుండెలపై ఆడే పసి పాపనేనయా ||2||
              అపాయ మేమి లేదు నా యేసయ్యా – నీ అరచేతిలో నేనుండగా

1.              కోడి తనపిల్లలను దాచుకొన్న రీతిగా
       నీవు నీ బిడ్డలను కాచుకొందువే ||2||
       నీరెక్కల నీడలో చక్కగ నివసింతును
       ఈ రీతిగ నుందును నిరతము నీనీడలో ||నీ||

2.            వేధనలు శోధనలు నను ముంచి వేసినా
       నీ చేయి ఎన్నడు నన్ను విడువదు ||2||
       నీటిలో మునిగిన పేతురునులేపితివే
       కన్నీటిలో మునిగిన నన్ను కాపాడెదవు ||నీ||

Neevu Leni Naa Jeevithaaniki Song Lyrics

నీవు లేని నా జీవితానికి

పల్లవి:    నీవులేని నా జీవితానికి అర్ధమే లేదని తెలుసుకోనైతిని ||2||
           లోకాశలు క్షణికమైనవి – తెలిసినంతలో శూన్యమై పోతిని ||2||
           ఆదరించుమా నజరేయుడా – ఓదార్చుమా నీతి సూర్యుడా ||2|| ||నీవు||

1.                 గాలి తగిలి ఎగిరిపోవు పొట్టు వంటి ఆశతో
        ఈ లోక సంపదకై తహతహలాడితిని ||2||
నిజ సంపద నీవని తెలుసుకున్నంతలో
మంచువలే నేను మరుగైపోతిని ||2||
ఆదరించుమా నజరేయుడా – ఓదార్చుమా నీతి సూర్యుడా ||2|| ||నీవు||

2.            సంద్రపు నురగలా చెదిరిపోవు పేరుకై – అడ్డదారిలో నేను పయనమైపోతిని
       నీ చేతిలో చిక్కిన పేరునని మరచి
       ఒక్కరోజు అతిధిలా మాసిపోతిని ||2|| ||నీవు||

Neevunte Naaku Chaalu Yesayyaa Song Lyrics


నీవుంటే నాకు చాలు యేసయ్యా

పల్లవి:        నీవుంటే నాకు చాలు యేసయ్యా - నీవెంటే నేను ఉంటానేసయ్యా ||2||
నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా - నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ||2||

          1.   ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ
             ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ ||2||
             నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా
             నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ||2||

        2.  బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూ
             అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా ||2||
           నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా
            నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ||2||

       3. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా
            ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా ||2||
          నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా
            నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ||2||

       4.  నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము
             నీదు కృపతో నాకేమియు కాదిల సమానము ||2||
          నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా
            నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ||2||