Saturday 17 February 2018

Nee Chetitho Nannu Pattuko Song Lyrics

నీ చేతితో నన్ను పట్టుకో

పల్లవి:        నీ చేతితో నన్ను పట్టుకో – నీ ఆత్మతో నన్ను నింపుము
              శిల్పి చేతిలో శిలను నేను – అనుక్షణము నన్ను చెక్కుము

1.                ఘోరపాపిని నేను తండ్రి – పాప ఊబిలో పడియుంటిని
లేవనెత్తుము శుద్ధిచేయుము – పొందనిమ్ము నీదు ప్రేమను ||నీ||

2.              అంధకార లోయలోన – సంచరించిన భయము లేదు
నీవాక్యం శక్తిగలది – నా త్రోవకు నిత్య వెలుగు ||నీ||

3.            ఈ భువికి రాజువు నీవే – నాహృదిలో శాంతి నీవే
       కుమ్మరించుము నీదు ఆత్మను – జీవితాంతం నీ సేవచేసెదన్ ||నీ||

No comments: