Friday 16 February 2018

Ennaalla Edureetha Song Lyrics

ఎన్నాళ్ళ ఎదురీత

పల్లవి:        ఎన్నాళ్ళ ఎదురీత నా యేసువా ఎన్నేళ్ళ ఎదకోత నా ప్రభువా
       నువులేని నన్ను ఊహించలేను... కలనైన నిన్ను నే వీడిపోను
నా నేస్తమై నీవు... రా... నా నీడవై నిలువ... రా

1.                కన్నీటి మేఘాలు నను కమ్ముకోగా – కష్టాల కనుమల్లో నే కూరుకోగా
నీ చేతి నందించి నను లేపుమా – ఎదలోన చీకట్లు ఇక మాపుమా
రా... రా... నా జీవమా... నీ... వే... నా దైవమా

2.              పాపల్లె అడుగేస్తూ నీ చెంతకొచ్చా – రెప్పల్లె నను నీవు కాపాడు స్వామీ
నాలోని శాపాలు తొలగించవా నా శూన్య బంధాలు చెరిపేయవా
దే... వా... మన్నించవా... రా... వా... దయచూపవా

No comments: