Saturday 17 February 2018

Naa Priya Yesu Raajaa Song Lyrics

నా ప్రియ యేసు రాజా

పల్లవి:        నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెపుడు
              శోధనలో వేధనలో నిను వీడి పోనీయకు

1.                కలుషితమగు ఈ లోకం – కదిలెను నా కన్నులలో
మరణ శరీరపు మరులే – మెదలెను నా హృదయములో
కల్వరిలో ఆదరించు – ఆదరించు – ఆదరించు ||నా||

2.              మరిచితినే నీ వాగ్ధానం – సడలెను నా విశ్వాసం
శ్రమల ప్రవాహపు సుడులే వడిగను పెనుగొనగ
కల్వరిలో ఆదరించు – ఆదరించు – ఆదరించు ||నా||

3.              నేరములెన్నో నాపై మోపెను ఆ అపవాది
తీరని పోరాటములో దూరముగ పరుగిడితిని
కల్వరిలో ఆదరించు – ఆదరించు – ఆదరించు ||నా||

4.              జాలిగ నిన్ను విడచితిని కోరితి దీవెనలెన్నో
భావనలే నేనరసి వదిలితి వాక్యాధారం
కల్వరిలో ఆదరించు – ఆదరించు – ఆదరించు ||నా||

No comments: