Thursday, 1 February 2018

Devudu Manishigaa Maare song lyrics

దేవుడు మనిషిగా మారే
సాకి:        దేవ గణాలే స్తుతులు గావించు వేళ స్వరాభిషేకం
                   అంతరంగమే ఆత్మవశమైన వేళ ఆత్మాభిషేకం ఆత్మాభిషేకం ||2||
                   సరిసరి సరిసరి సరిసరి / గపగప గపగప గపగప గపగప
                   దప మప మప గరి / మద గరిస నిస... నిస...

పల్లవి:       దేవుడు మనిషిగా మారే యాగ పీఠమిది
స్వర్గ మహిమ భువి చేరే దివ్య పూజ ఇది
ఆత్మ రూపియే రూపం దాల్చె పావన వేదికిది
మనిషికి జీవము నొసగే పరమ యాగమిది ||2||

కో:            రండి రండి దేవుని జనమా అమరుని సేవకు అనురాగముతో ||2||
                ఎదలను కడిగి ముదమున కదలి రాజుల రాజుకు హారతులివ్వగా ||2||
                పసనిదమ... మనిదపగ... గదపమరి... రగపపనిస...

1.              ఇది జీవం ఆకృతి దాల్చే శుభ సమయం
 ఇది ప్రేమకు ఊపిరులూదే శుభ తరుణం ||2||
దేవుడు మనిషిని చేరే సంఘమ సమయం
 ఇహ పరములకు నడుమన నిత్య నిబంధనం ||2|| ||రండి||

2.            విశ్వధాత్రికిది పరంధాముని శుభసందేశం
శాంతిస్థాపనకు ప్రేమరూపుని నిజ సంకేతం ||2||
అనురాగానికి ఆలంభనయి అమృతకలశం
             ఆదిదేవుని ప్రియవాగ్ధానం ఈ బలియాగం ||2|| ||రండి||

No comments: