Saturday 10 March 2018

Hithamu Marachi Nadachi Song Lyrics

హితము మరచి నడచి (Hithamu Marachi Nadachi)

పల్లవి:        హితము మరచి నడచి పతనమైతి నేను
              సుతుని పథము వదలి మృతము జేరినాను
              నీ మాటలనే మరచినానులే – ఈ చీకటిలో మిగిలిపోతిని

1.             ఈ మోహంలో మునిగిపోతిని – ఏ దరిని జేరక నిలిచిపోతిని
ఈ జీవిత పయనంలో ఓడిపోతిని – నీ సన్నిధినే కోరుకొంటిని

2.            నా ఊహలలో ఎరిగిపోతిని – ఏ ఆశ తీరక అలసిపోతిని
      ఈ బ్రతుకే శూన్యమని తెలుసుకొంటిని – నీ పిలుపునకై వేచియుంటిని

Hrudaya Rahasyamu Lerigina Devaa Song Lyrics

హృదయ రహస్యము లెరిగిన దేవా (Hrudaya Rahasyamu)

పల్లవి:        హృదయ రహస్యము లెరిగిన దేవా – వినయ నివేదన వినరావా ||2||
              హృదయ శుద్ధిని ఒసగుము దేవా – పరిశుద్దుడవగు నా ప్రభువా ||2||
              పరిశుద్దుడవగు నా ప్రభువా ||3||

1.             అదుపులేని నోటితో మాటమీరితి – దుడుకువాని రీతినే అనుసరించితి ||2||
తప్పునెరిగి నిన్నే నేను చేరుకొంటిని – కరుణించుమా ఈ దీనుని ||2|| ||హృద||

2.            భయభక్తులు విడనాడిన ద్రోహినైతిని
       దోషములను లెక్కించిన నిలువనంటిని ||2||
      మంచుకంటె తెల్లగా మార్చుము తండ్రి
      నీతిమంతుడా నీ దీవెనలీయి ||2|| ||హృద||

Shudda Hrudayam Kalugajeyumu Song Lyrics

శుద్ధ హృదయం కలుగజేయుము (Shudda Hrudayam)

పల్లవి:        శుద్ధ హృదయం కలుగజేయుము ||2||
              నాలోనా... నాలోనా... నాలోనా... నాలోనా ||శుద్ధ||

1.             నీ వాత్సల్యము – నీ బాహుల్యం – నీ కృప కనికరము చూపించుము ||2||
పాపము చేశాను – దోషినైయున్నాను ||2||
తెలిసియున్నది నా అతిక్రమమే – తెలిసియున్నది నా పాపములే ||2||
నీ సన్నిధిలో – నా పాపములే ఒప్పుకొందునయ ||శుద్ధ||

2.            నీ జ్ఞానమును – నీ సత్యమును – నా అంతర్యములో పుట్టించుము ||2||
ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగజేయుము 
నా హృదయములో ||2||
నీ సన్నిధిలో – పరిశుద్దాత్మతో నన్ను నింపుమయా ||శుద్ధ||

Vedakani Chote Ledu Song Lyrics

వెదకని చోటే లేదు (Vedakani Chote Ledu)

పల్లవి:        వెదకని చోటే లేదు నా దేవుని కోసం
              వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం ||2||
              వెదకితిని వేసారితిని అంతటా తిరిగితిన్ 
              తను కానరాక నే కలత చెందితి ||2||
              వేదనతో రోధనతో కన్నీరు కార్చితి
              నా లోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు ||2||
              ప్రేమే దేవుని స్వభావము ప్రేమే దేవుడు ||2||

1.             కొండలనడిగ కొండ కోనల నడిగా నా ప్రభువెక్కడని
సంద్రమును జలరాశుల నడిగ నా ప్రభువెక్కడని
అడవులనడిగ అందుజీవుల నడిగ ||2||
ఉలుకే లేదు పలుకే లేదు జవాబేలేదు ||నాలో||

2.            రివ్వున ఎగిరే గువ్వల నడిగ దేవుడు ఎక్కడని
సుమధుర గానాల కోయిల నడిగ నా ప్రభువెక్కడని
జలజల పారే సెలయేటి నడిగ ||2||
ఉలుకే లేదు పలుకే లేదు జవాబేలేదు ||నాలో||

Vilapinche Hrudayam Song Lyrics

విలపించె హృదయం (Vilapinche Hrudayam)

పల్లవి:                విలపించె హృదయం కన్నీరు మున్నీరుగా
                     ద్వేషముతోను మోసముతోను ||2||
                     నలిగిన హృదయమిది ||2|| ||విలపించె||

                సాసససస దస దరి సదపా / పాపపపప గపగని దపగా
                గాగగగగ రిగరిమ గరిసద / దసపదసా రిగసరిగా పదసదపా
1.             ఉన్నోడినంటూ గర్వముతోను – నావారినందరిని కోల్పోతిని ||2||
సకలము నీవని గుర్తించితిని ||2||
ఉన్నదంతయు సమర్పించెద కరుణామయ దేవా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా  ||2|| ||విలపించె||

Virigi Naligina Maa Paapa Hrudayaalanu Song Lyrics

విరిగి నలిగిన మా పాప హృదయాలను (Virigi Naligina)

పల్లవి:    విరిగి నలిగిన మా పాప హృదయాలను
           కరుణించి క్షమియించు కరుణాకరా ||2||

1.                 నీవులేని మమకారం – కలిగెను జీవిత బాధలలో ||2||
నీవు లేని శాంతికిరణం ప్రేమ లేనిమాదు
హృదయం తిరిగెను బాధలలో ||విరిగి||

2.                 నీవులేని ఈ లోకం నడిచెను చీకటి దారులలో ||2||
        నీవులేని మాదు స్నేహం 
       తోడులేని మాదు మార్గం నడిచెను పాపములో ||విరిగి||

Vinavaa Manavi Yesayyaa Song Lyrics

వినవా మనవి యేసయ్యా (Vinavaa Manavi Yesayyaa)

పల్లవి:        వినవా మనవి యేసయ్య - ప్రభువా శరణం నీవయ్యా
మలినము నా గతం - పగిలెను జీవితం
చేసుకో నీ వశం - వినవా ప్రభువా

1.          లోక స్నేహమే కోరి దూరమైతిని - వీడిపోయి నీ దారి ఓడిపోతిని
             విరిగిన మనస్సుతో నిన్ను చేరాను - చితికిన బ్రతుకులో బాగు కోరాను
నన్ను స్వీకరించి నీతో ఉండనీ యేసయ్యా - నా తండ్రి నీవేనయ్యా

2.          ఆశ యేది కనరాక బేలనైతిని - బాధలింక పడలేక సోలిపోతిని
అలసిన కనులతో నిన్ను చూశాను - చెదరిన కలలతో కృంగిపోయాను
నన్ను సేదదీర్చి సంతోషించనీ యేసయ్యా - నా దైవము నీవయ్యా

Lekkaleni Paapaalu Song Lyrics

లెక్కలేని పాపాలు (Lekkaleni Paapaalu)

పల్లవి:        లెక్కలేని పాపాలు భారమైన జీవితం 
              నూనెలేని దీపములా సాగుచున్న జీవితం
              పగిలి పోయిన మట్టిపాత్రను నేను నాధా
              మరలా నాకు పునర్జీవిత మొసగుమోనాధా  ||2|| ||లెక్క||
              కరుణ చూపుమా నాపై కనికరించుమా
              పాపిని నేను నాధా పాపినీ నేను ||2||

1.             పూర్వపాపపు శాపము మోయుచుండగా
       వ్యాధియు, బాధలు అధికమాయెను ||2||
దేవా దేవుని ఆత్మ నాలో నీర్జీవమై – పాపం నన్ను పాతాళ త్రోవలో చేర్చే
కరుణ చూపుమా నాపై కనికరించుమా
పాపిని నేను నాధా పాపినీ నేను ||2||

2.            వేంచేసి రావయ్యా మంచి దైవమా
       ప్రేమను కరుణను ఒసగుమో ప్రభువా ||2||
పదిరెట్లు ప్రేమతో తిరిగి నే వచ్చెద
మరల నన్ను నీ రెక్కల నీడలో వుంచు
కరుణ చూపుమా నాపై కనికరించుమా
పాపిని నేను నాధా పాపినీ నేను ||2||

Yesu Goriya Pillanu Nenu Song Lyrics

యేసు గొరియ పిల్లను నేను (Yesu Goriya Pillanu Nenu)

పల్లవి:               యేసు గొరియ పిల్లను నేను – వధకు తేబడిన గొరియ పిల్లను
                    దిన దినము చనిపోవుచున్నాను – ఏసు క్రీస్తులో బ్రతుకుచున్నాను

1.             నా తలపై ముళ్ళు గుచ్చబడినవి – నా తలంపులు ఏడుస్తున్నవి ||2||
నా మోమున ఉమ్మి వేయబడినది – నా చూపులు తలదించుకున్నవి ||2|| ||యేసు||

2.            నా చేతులు సంకెళ్ళు పడినవి – నా వ్రాతలు చెదిరిపోవు చున్నవి ||2||
నా కళ్ళకు మేకులు దిగబడినవి – నా నడకలు రక్తసిక్తమయినవి ||2|| ||యేసు||

Yesayyaa Naa Daivamaa Song Lyrics

యేసయ్యా నా దైవమా (Yesayyaa Naa Daivamaa)

పల్లవి:        యేసయ్యా నా దైవమా – నా మీద దయచూపుమా
              జీవ ఊటయైన నిన్నే మరచితిని నేను ఎండి పోయితిని
              నన్ను జీవింప చేయుమయా

1.             ముళ్ళ కిరీటమును – అయ్యా నా కోసం ధరించితివి
రక్త ధారలను – అయ్యా నా కోసం చిందితివి

2.            నీవు పొందిన దెబ్బలచే నా గాయములను స్వస్థ పరచితివి
       నీవు చిందిన రక్తముచే – నా పాపములను కడిగితివి

Yesu Yesu Neechamaina Song Lyrics

యేసు యేసు నీచమైన ఈ పాపిపై (Yesu Yesu Neechamaina)

పల్లవి:        యేసు యేసు నీచమైన ఈ పాపిపై – చూపిస్తున్నావా ఇంతదయా
              ఎందుకయా యేసయ్యా – ఎందుకయా ఇంతదయా

1.             పాపము యొక్క వేతన మరణం – నా పాపం నావెంటనే వచ్చును ||2||
కనుకనె నా కోసం ఏడ్చితివా – తండ్రి నా బిడ్డలను మన్నించుమని
కల్వరిలో ఏడ్చితివా – నా కోసం ఏడ్చితివా ||ఎందు||

2.            నిన్ను వదలి వెనుకకు తిరిగి – నీ శక్తిని కోల్పోతిని
కనుకనే నా కోసం ఏడ్చితివా
దాహముతో నే ఉన్నానని – నా ఆత్మకోసం ఏడ్చితివా ||ఎందు||

Malachumu Maarchumu Naa Yesayyaa Song Lyrics

మలచుము మార్చుము నా యేసయ్యా (Malachumu Maarchumu)

పల్లవి:        మలచుము మార్చుము నా యేసయ్యా
              ఈ పాపి హృదయము నీదు పరిశుద్ద మందిరంగా

1.             విత్తనం నశించాలయ్యా – అదిచెట్టుగా మారాలంటే
ఈ దేహం నశించాలయ్యా – నీ జీవమును పొందాలంటే
కల్వరిలో బలిగా నిన్నే అర్పించిన యేసు
కరిగించు రూపొనరించు నీలాగ నన్ను మార్చు
యేసు... యేసు... యేసు... యేసు

2.            చిత్తశుద్దితో ఉండాలంటే – నీ చిత్తమే చేయాలయా
నీ వెలుగుతో నే నడవాలంటె – క్రొవ్వోత్తిలా కరగాలయా
కల్వరిలో బలిగా నిన్నే అర్పించిన యేసు
కరిగించు రూపొనరించు నీలాగ నన్ను మార్చు
యేసు... యేసు... యేసు... యేసు