Saturday 10 March 2018

Vinavaa Manavi Yesayyaa Song Lyrics

వినవా మనవి యేసయ్యా (Vinavaa Manavi Yesayyaa)

పల్లవి:        వినవా మనవి యేసయ్య - ప్రభువా శరణం నీవయ్యా
మలినము నా గతం - పగిలెను జీవితం
చేసుకో నీ వశం - వినవా ప్రభువా

1.          లోక స్నేహమే కోరి దూరమైతిని - వీడిపోయి నీ దారి ఓడిపోతిని
             విరిగిన మనస్సుతో నిన్ను చేరాను - చితికిన బ్రతుకులో బాగు కోరాను
నన్ను స్వీకరించి నీతో ఉండనీ యేసయ్యా - నా తండ్రి నీవేనయ్యా

2.          ఆశ యేది కనరాక బేలనైతిని - బాధలింక పడలేక సోలిపోతిని
అలసిన కనులతో నిన్ను చూశాను - చెదరిన కలలతో కృంగిపోయాను
నన్ను సేదదీర్చి సంతోషించనీ యేసయ్యా - నా దైవము నీవయ్యా

No comments: