Saturday 10 March 2018

Paapapu Lokamlo Unnaanu Song Lyrics

పాపపు లోకంలో ఉన్నాను

పల్లవి:        పాపపులోకంలో ఉన్నాను – పాపాలెన్నో చేస్తున్నాను ||2||
              నీ కరుణకు దూరమై – నీ ప్రేమకు భారమై
              అలసిపోయి అలమటించుచున్నాను
              నీ చెంతనే శిరము వంచియున్నాను
              కరుణించవా దయచూపవా – మన్నించవా దీవించవా ||2||

1.             అమ్మవలె చేరదీసినావు – నాన్నవలె అభయమిచ్చినావు ||2||
హితునివలె మేలు చేసినావు – నిన్ను ఎలా మరచిపోయి జీవించగలను 
||2|| ||పాప||

2.            నీ వాక్యమే నాకు జ్యోతియై – నీ సత్యమే నాకు బాటయై
       నీ రూపమే నాకు నిత్యమై – నా ఆత్మ వెలగాలి దివ్య దీపమై ||2|
||పాప||

No comments: