Saturday 10 March 2018

Maree Maree Neekide Song Lyrics


మరీ మరీ నీకిదె (Maree Maree Neekide)

పల్లవి:        మరీ మరీ నీకిదె మనవి చేసుకొందుము
              పదేపదే నీ స్తుతి పాడుతూ వుందుము ||2||
నీ గానమునంత వరకు మా ప్రాణమునంత వరకు
మా గానం నీవె మా ప్రాణం నీవె - మా ధ్యానం నీవె దేవా ||2||

1.             పాపహరణము ఓ ప్రభూ నీ సహవాసము
       మా నిత్య నివాసం నీ మందిరమే ||2||
మాదీన హృదయాలే మహిమగీతాలై ||2||
నీ దివ్య చరిత నిరతం ఇలలో ఆలపించేము ||నీ||

2.            కీర్తనీయము ఓ ప్రభూ నీ గుణగుణం
       మా శాంతిధామం నీ ఆలయమే ||2||
మా పేద బ్రతుకులె నీ పాద సేవలు ||2||
కర్పూరకనికై నిరతం కరిగే పరవసించెను ||నీ||

No comments: