లెక్కలేని పాపాలు (Lekkaleni Paapaalu)
పల్లవి: లెక్కలేని పాపాలు భారమైన జీవితం
నూనెలేని దీపములా
సాగుచున్న జీవితం
పగిలి పోయిన మట్టిపాత్రను నేను నాధా
మరలా నాకు పునర్జీవిత
మొసగుమోనాధా ||2|| ||లెక్క||
కరుణ చూపుమా నాపై కనికరించుమా
పాపిని నేను నాధా పాపినీ నేను ||2||
1.
పూర్వపాపపు శాపము
మోయుచుండగా
వ్యాధియు, బాధలు అధికమాయెను ||2||
దేవా దేవుని ఆత్మ నాలో నీర్జీవమై –
పాపం నన్ను పాతాళ త్రోవలో చేర్చే
కరుణ చూపుమా నాపై కనికరించుమా
పాపిని నేను నాధా పాపినీ
నేను ||2||
2.
వేంచేసి రావయ్యా
మంచి దైవమా
ప్రేమను కరుణను ఒసగుమో ప్రభువా ||2||
పదిరెట్లు ప్రేమతో తిరిగి నే వచ్చెద
మరల నన్ను నీ రెక్కల
నీడలో వుంచు
కరుణ చూపుమా నాపై కనికరించుమా
పాపిని నేను నాధా పాపినీ నేను ||2||
No comments:
Post a Comment