Saturday 10 March 2018

Vedakani Chote Ledu Song Lyrics

వెదకని చోటే లేదు (Vedakani Chote Ledu)

పల్లవి:        వెదకని చోటే లేదు నా దేవుని కోసం
              వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం ||2||
              వెదకితిని వేసారితిని అంతటా తిరిగితిన్ 
              తను కానరాక నే కలత చెందితి ||2||
              వేదనతో రోధనతో కన్నీరు కార్చితి
              నా లోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు ||2||
              ప్రేమే దేవుని స్వభావము ప్రేమే దేవుడు ||2||

1.             కొండలనడిగ కొండ కోనల నడిగా నా ప్రభువెక్కడని
సంద్రమును జలరాశుల నడిగ నా ప్రభువెక్కడని
అడవులనడిగ అందుజీవుల నడిగ ||2||
ఉలుకే లేదు పలుకే లేదు జవాబేలేదు ||నాలో||

2.            రివ్వున ఎగిరే గువ్వల నడిగ దేవుడు ఎక్కడని
సుమధుర గానాల కోయిల నడిగ నా ప్రభువెక్కడని
జలజల పారే సెలయేటి నడిగ ||2||
ఉలుకే లేదు పలుకే లేదు జవాబేలేదు ||నాలో||

No comments: