Saturday 10 March 2018

Yesu Goriya Pillanu Nenu Song Lyrics

యేసు గొరియ పిల్లను నేను (Yesu Goriya Pillanu Nenu)

పల్లవి:               యేసు గొరియ పిల్లను నేను – వధకు తేబడిన గొరియ పిల్లను
                    దిన దినము చనిపోవుచున్నాను – ఏసు క్రీస్తులో బ్రతుకుచున్నాను

1.             నా తలపై ముళ్ళు గుచ్చబడినవి – నా తలంపులు ఏడుస్తున్నవి ||2||
నా మోమున ఉమ్మి వేయబడినది – నా చూపులు తలదించుకున్నవి ||2|| ||యేసు||

2.            నా చేతులు సంకెళ్ళు పడినవి – నా వ్రాతలు చెదిరిపోవు చున్నవి ||2||
నా కళ్ళకు మేకులు దిగబడినవి – నా నడకలు రక్తసిక్తమయినవి ||2|| ||యేసు||