Saturday 10 March 2018

Paapulanu Preminche Yesayyaa Song Lyrics

పాపులను ప్రేమించే యేసయ్యా (Paapulanu Preminche Yesayyaa)

పల్లవి:                పాపులను ప్రేమించే యేసయ్యా
                     నే పాపిగా నీ ముందు నిలచినానయ్యా
                     యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా
                     యేసయ్యా యేసయ్యా నా మెస్సయ్యా

1.             ఈ లోక జీవితం దాని వైభవం – గడ్డి పువ్వు వంటిదన్నసత్యమెరుగక
       ఆశల సుడిగాలిలో నే చిక్కుకొంటిని – అలసి సొలసి నీ సన్నిధి చేరితినయ్యా

2.          పాపి మగ్దలేనను ప్రేమతో పిలచి – పాప విమోచనను నీవు ప్రసాదించగా
పరివర్తన జీవితముతో నీ బిడ్డగ నిలచినట్లు – నేను కూడ నీ సన్నిధి నిలచితి దేవా

No comments: