Sunday 4 March 2018

Parishuddudaa Parishuddudaa Song Lyrics

పరిశుద్దుడా పరిశుద్దుడా

పల్లవి:    పరిశుద్దుడా  పరిశుద్దుడా – నీలాగే నను మార్చు పరిశుద్దుడా
           ఇది పరిశుద్ద కాలమయ్యా – అది పరిశుద్ద ప్రజల యొక్క కాలమయ్యా 
||2|| ||పరి||

1.               అన్ని రకమైన తలపులకు లొంగిన రోజులు చాలు
అన్ని రకమైన అలవాటులతో ఆడిన రోజులు చాలు
అబ్భా నీ విచ్చినదంతా కోల్పోయాను
దుష్టుని వలలో చిక్కుకొని ఏడుస్తున్నాను ||2||
నీ పరిశుద్ద రక్తముతో నను కడుగుమా
నీ పరలోక ఆత్మతో నను నింపుమా ||2|| |పరి|

2.            నన్ను నీవు తరిమేసినా ఎక్కడికి నే వెళ్ళెదను
నీదు ఆత్మను తీసివేసినా ఎట్లు నేను జీవింతును
అబ్భా నీలో ఉన్నంతవరకే నాకు సంరక్షణ ||2||
నీ పరిశుద్ద కవచమును నా కివ్వుమా
నీ కల్వరి భారము నా కివ్వుమా ||2|| ||పరి||

No comments: