Friday 2 February 2018

Suprabhaatha Velalo Prakruthi Pulakinchaga Song lyrics


సుప్రభాత వేళలో ప్రకృతి పులకించగ  

సాకి:       సృష్టికర్త తండ్రి దేవుని ఆరాధింప - రక్షణ దాత క్రీస్తు ప్రభుని ప్రార్థింప
              వరప్రదాత పవిత్రాత్మ సర్వేశుని ప్రణుతింప - దైవ జనమా రారే
              త్రియేక దేవుని కొలువగ రారే
              
             సాసససస గరిపగరి సాసససస గరిపగరి - పాపపపప నిపసనిపగ
             పాపపపప నిపసనిపగ - పనిసరిగా గపనిసరి గాగరిసని
             రిరిసనిప సాసనిపగా - రిగపనిస గపనిస పనిస

పల్లవి:   సుప్రభాత వేళలో ప్రకృతి పులకించగ
            గుడిగంటలు మ్రోగే ప్రభు పూజకు రమ్మని ||2||
            ఆ జీవదాతను కొలువగ నేడే - పరిమళాల నవ సుమాల మాలలతో
            కదలి రండి తరలి రండి వేవేగమే       ||2|| || సుప్రభాత||

1.      ఆదాము పాపము తను బాపుటకు - అరుదెంచెను ఆ దైవమే
      మూసియున్న స్వర్గద్వారములు తెరచుటకు - తానాయెను బలి గొఱ్ఱెపిల్ల ||2||
     కల్వరి బలి వేదికపై అర్పించె యాగబలి   ||2||
    ఆ దివ్య బలికి శుభ సమయమిదే - మచ్చలేని స్వచ్చమైన హృదయాలతో
    కదలి రండి తరలి రండి వేవేగమె  ||2||  ||సుప్రభాత||

2.              అపవాది దాస్యమున మన విడుదలకు - తను చెల్లించే రక్తమూల్యము
పరలోక తండ్రి దరికి మనలను చేర్చ - నూతన పాస్కగ తను మారెను ||2||
యాజకుడు అర్పించే ఈ దివ్య పీఠముపై  ||2||
శాంతి దూత అతడు  వేంచేయును - మరువలేని మధురమైన గీతికతో
పాడరండి కొలువగ రండి వేవేగమె        ||2||  ||సుప్రభాత||

No comments: