Friday 16 February 2018

Kanulaku Kanapadavu Naa Paapamulu Ennadu Song Lyrics

కనులకు కనపడవు నా పాపములు ఎన్నడు

పల్లవి:        కనులకు కనపడవు నా పాపములు ఎన్నడు
              చెవులకు వినపడవు నా దోషములు ఎప్పుడు
              యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా
              పాపదోషమున మ్రగ్గితిని ఇన్నాళ్ళు 
              మన్నించుమయా మమకార హృదయా ||2||

1.   నరులలో ఘనత మనుజులలో ప్రతిజ్ఞ – పరమావధిగా తలచి తిరిగితిని
నీ కరుణను మరచి కలుషాత్ముడనై తిని – కడకు నీ కడకే చేరితిని
దీనుడనై... చేరితిని శూన్యుడనై బ్రతికితిని ||2|| ||యేస||

2.   నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము
    నీ పరిశుద్దాత్మను నా నుండి తీయకుము
వినయ సంపదను నా హృదయములో నింపి
       నీ రక్షణ ఆనందం తిరిగియిమ్ము తండ్రి మరల యిమ్ము తండ్రి ||2|| ||యేస||

No comments: