Friday, 16 February 2018

Enduku Swamy Nannu Neevu Song Lyrics

ఎందుకు స్వామి నన్ను నీవు

పల్లవి:        ఎందుకు స్వామి నన్ను నీవు ఎంచుకొంటివి
              అల్పుడనైన నన్ను నీ చేతులలో దాచుకొంటివి
              నీ కన్నులలో పాపగా నన్ను మలచుకొంటివి
ఊపిరిలోని ఊపిరిగా నన్ను నిలుపుకొంటివి

1.               పనికిరాని మట్టిని నేను పసిడి బొమ్మగా చేసినావు
ఏమిరాని వెదురును రాగమయం చేసినావు
గడ్డిపువ్వునైన నన్ను సువాసనతో నింపినావు
అంతులేని ప్రేమతో నన్ను నీ సొంతం చేసినావు ||2|| ||ఎందుకు||

2.              రాతి శిలకు ప్రేమమీర రంగులెన్నో వేసినావు
నీ చేతులతో నన్ను తాకి వెన్న ముద్దుగ చేసినావు
గాలిలోన దాగియున్న దూళినయ్యా నేను స్వామి
ఎందుకయ్యా నీ ఎదపై ముదమార నిలుపుకొంటివి
స్వాగతం సుస్వాగతం – దైవతనయా ఘనస్వాగతం
సాసాసస సరిసగ రిసనిప నీనీనిని నిసనిరి నిపగస ||2|| ||ఎందుకు||

No comments: