Saturday 17 February 2018

Naaloni Prema Jyothini Velunga Neeyumaa Song Lyrics

నాలోని ప్రేమ జ్యోతిని వెలుంగ నీయుమా

పల్లవి:        నాలోని ప్రేమ జ్యోతిని వెలుంగ నీయుమా
              ప్రజాళికే నే దివ్వెనై ప్రకాశమియ్యగా
      
1.              నీదు ప్రేమ బాటలో నేను సాగిపోవగా
       జీవనాత్మ పదములే నేను చూచి సాగగా
       నాదు కండ్లు తేటగా ఆదరంబు చూపగా ||2|| ||నా||

2.            ఎల్లవేళ నేను నీ దాపుచేరి శాంతిగా – నీతిమాలి యుండగా భారమెల్ల తీరగా
       స్వామి నాకు నేర్పుమా నూత్న ప్రేమ మార్గము ||2|| ||నా||

3.            జీవ జలము నీయుమా జీవదాత కావుమా
       జీవ మార్గంబునే నన్ను నడిపింపుమా
       చేయి చాచి ప్రేమతో చేరదీసి నేర్పుమా ||2|| ||నా||

4.             సర్వ జనుల బ్రోవ స్వంత ప్రాణమియ్యవా
       సిల్వదారి కోరిన త్యాగమూర్తి నీవేగా
       ఆశలెల్ల దీర్చుమా స్వర్గమునకు చేర్చుమా ||2|| ||నా||

No comments: