మా దేవుని ఉత్సవము మా క్రీస్తుని
పల్లవి: మా దేవుని ఉత్సవము మా క్రీస్తుని సంబరము
మా గురువుల
పూజోత్సవము
రండి ప్రియులారా రండి
కతోలికులారా
ఆరాధించుదాం ఆనందించుదాం
మనసార దీపం, ధూపం, పుష్పం
హారతులిడుదాం
1. తొలికూతవేళ, ఉత్థాన ఘడియలో – మదినిండుగ
ప్రభువుండగా
కల్వరి బలిలో జీవింప ||2||
ఉత్సాహించుదాం, ఉల్లాసించుదాం ||2||
వినయముతో శిరము వంచి ప్రభువును
ప్రణుతించుదాం ||మా దేవుని||
2. మట్టి మనిషిని బంగారు మనిషిగ
మార్చే ప్రభు బలిని
స్మరియించుదాం ||2||
కరములు మోడ్చి పూజింప ||2||
ఆస్వాదించుదాం, ఆహ్లాదించుదాం ||2||
ముదమారా తనువు, మనస్సు, పరచి
పరవశించుదాం ||మా దేవుని||
No comments:
Post a Comment