Saturday 17 February 2018

Karunachoopa Raavaa Karunaakara Devaa Song Lyrics


కరుణచూప రావా కరుణాకర దేవా

పల్లవి:        కరుణచూప రావా కరుణాకర దేవా
పాపులము దీనులము పరితాప హృదయులము
కరుణించి క్షమించుమా దయగల సర్వేశ్వరా

1.             మా దోషముల నెల్ల నీ మ్రోలవినిపింప
       నీ ద్వారము చెంత వేచియున్నామయా
మనస్సు విప్పి ప్రియమారా పిలువలేకున్నామయా
కన్నులెత్తి నీ మోమును చూడలేకున్నామయా

2.            నీ ప్రేమనే మరచి వ్యామోహ బంధీలమై
       నీ సన్నిధి విడచి బహు దూరమైతిమి
అపరాధ భావముతో కుమిలి పోతున్నామయా
నీ పాదములను కన్నీటితో కడగాలనుకున్నామయా

No comments: