Saturday 17 February 2018

Neevunte Naaku Chaalu Yesayyaa Song Lyrics


నీవుంటే నాకు చాలు యేసయ్యా

పల్లవి:        నీవుంటే నాకు చాలు యేసయ్యా - నీవెంటే నేను ఉంటానేసయ్యా ||2||
నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా - నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ||2||

          1.   ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ
             ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ ||2||
             నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా
             నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ||2||

        2.  బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూ
             అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా ||2||
           నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా
            నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ||2||

       3. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా
            ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా ||2||
          నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా
            నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ||2||

       4.  నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము
             నీదు కృపతో నాకేమియు కాదిల సమానము ||2||
          నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా
            నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ||2||

No comments: