పూజలు సేయ దేవుని జనమా
పల్లవి: పూజలు సేయ దేవుని జనమా – పూమాలలతో పరుగున
రండి ||2||
పావనయేసుని వాగ్దానముల ||2||
ఫలమును పొంద వేగమె రండి ||2|| ||పూజ||
1. ఆది దేవుని అభిషిక్తుడూ – మానవాళికి రక్షణ
మూర్తి ||2||
సిలువ బలియను యాగమున ||2||
పండించును నవజీవం ||2|| ||పూజ||
2. జీవమోసగు పరమాత్మునికి – హృదయ దీపిక
వెలిగించుదమా ||2||కరుణతోడ జీవము నీయగ ||2||
వేడుదమా పరిశుద్ధుని ||2|| ||పూజ||
No comments:
Post a Comment