Friday 2 February 2018

Shubhamulu Koorche Swamyki song Lyrics

శుభములు కూర్చే స్వామికి

సాకి:          సర్వమును పాలించు స్వామి నా సర్వము నీవైన ఈ శుభవేళ
                   నిను సేవింతును నిను పూజింతును

పల్లవి:       శుభములు కూర్చె స్వామికి నేడు సేవలు చేయ వేళాయె రండి ||2||
                 మనసార దరిచేరు ఆ రేడు మనతోడ జాగును వీడి వేడగ రండి 
 ||శుభ|| 

1.               తీయని మాటల మాధుర్యమును మాయని మమతల సహచర్యమును
చేతులలోనే చూపిన స్వామిని కొనియాడుటకై త్వరపడి రండి ||2|| 
||శుభ||

2.               శాశ్వత ప్రేమను ప్రజలకు పంచి ప్రాణము కంటే మిన్నగ యెంచి
              తన స్నేహితులని మనలను పిలిచిన ప్రేమమయుని పూజకు రండి ||2|| 
||శుభ||

No comments: