Friday 2 February 2018

Randi Suvaartha Sunaadamutho Song Lyrics

రండి సువార్త సునాదముతో

పల్లవి:        రండి సువార్త సునాదముతో - రంజిలు సిలువ నినాదముతోతంబుర సితార నాదముతో - ప్రభు యేసు దయానిధి సన్నిధికి ||2|| ||రండి||

1.             యేసే మానవ జాతి వికాసం - యేసే మానవ నీతి విలాసం
యేసే పతీత పావన నామం - భాసుర క్రైస్తవ శుభ నామం
 ||రండి||

2.             యేసే దేవుని ప్రేమ స్వరూపం - యేసే సర్వేశ్వర ప్రతిరూపం
యేసే ప్రజాపతి పరమేశం - ఆశ్రిత జనముల సుఖవాసం
 ||రండి||

3.             యేసే సిలువను మోసిన దైవం - యేసే ఆత్మల శాశ్వత జీవం
యేసే క్షమాపణ అధికారం - దాసుల ప్రార్ధన సహకారం ||రండి||

4.             యేసే సంఘములో మన కాంతి - యేసే హృదయములో ఘన శాంతి
యేసే కుటుంబ జీవన జ్యోతి - పసిపాపల దీవెన మూర్తి
 ||రండి||

    5.     యేసే జీవన ముక్తికి మార్గం - యేసే భక్తుల భూతల స్వర్గం
            యేసే ప్రపంచ శాంతికి సూత్రం - వాసిగ నమ్మిన జన స్తోత్రం ||రండి||

No comments: