నీ పూజలు చేయగ మనసాయె నాకు
పల్లవి: నీ పూజలు చేయగ మనసాయె నాకు – నీ సేవలు చేయగా
వరమాయె నాకు
మా పూజా బలులను – అందుకోవయా – ఈ దాసులందరిని – ఆదుకోవయా
1.
విరిసీ విరియని మనసులె మావి – తెలిసీ తెలియని
పూజలె మావి
నీ పూజలు చేసే పూజారుల మేము – నీ పద సేవలు చేయగ
నిమ్మయా
2.
అనురాగానికి – నీవే నిలయం – అందరికి నీ చరణమే
శరణం
సదా నిన్ను తలచుటే మాకిల పుణ్య – నిరతము నిను కొలుచుటే మా భాగ్యం
No comments:
Post a Comment