Friday 2 February 2018

Randi Uthsaahinchi Paadudamu song lyrics

రండి ఉత్సాహించి పాడుదము

పల్లవి:         రండి ఉత్సాహించి పాడుదము - రక్షణ దుర్గము మన ప్రభువే ||2||
రండి కృతజ్ఞత స్తోత్రముతో - రారాజు సన్నిధికేగుదము ||2||
సత్ప్రభు నామము కీర్తనలన్ - సంతోష గానము చేయుదము ||రండి||

1.             మన ప్రభువే మహా దేవుండు - ఘన మహాత్యము గల రాజు ||2||
భూమ్యాగాధపు లోయలును - భూధర శిఖరములాయనవే ||రండి||

2.               సముద్రము సృష్టించెనాయనదే - సత్యుని హస్తమే భువిజేసెన్ ||2||
ఆయన దైవము పాలితుల - ఆయన మేపెడి గొర్రెలము ||రండి||

3.               ఆ ప్రభు సన్నిధి మోకరించి - ఆయన ముందర మ్రొక్కుదము ||2||
ఆయన మాటలు గైకొనిన - అయ్యవి మనకెంతో మేలగును ||రండి||

    4.     తండ్రి కుమార శుద్దాత్మకును - తగు స్తుతి మహిమలు కల్గు గాక ||2||
            ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ - అయినట్లు యుగములనౌను ఆమెన్ ||రండి||

No comments: