Thursday, 1 February 2018

Poojaa Parimala Sumamulatho song lyrics

పూజా పరిమళ సుమములతో

పల్లవి:      పూజా పరిమళ సుమములతో అర్చన చేయుదము
               మంజుల గాన మాధుర్యముతో పూజలు చేయుదము
               స్తుతి స్తోత్రములతో నైవేద్యములతో - ఘనుడగు దేవుని కొలిచెదము ||2|| 
          రండి రండి కోయిల స్వరములతో - రండి రండి స్వాగత గీతం పాడెదము ||2||

1.             అబ్రహాము దేవుని మదిలో స్మరియింతుము
ఇజ్రాయేలు దేవుని హృదిలో ధ్యానింతుము ||2||
రవి చంద్ర తారలు పశు పక్షి ప్రాణులు
పర్వత లోయలు సంకీర్తన చేయగా
హృదయం ధ్యానం ఆనంద గీతం పాడెదము
దైవం జీవం అంజలి గీతం పాడెదము ||రండి||

2.               జీవం పోసిన దేవుని మరువక కొలిచెదము
వరములు పంచిన దేవుని నిరతం పూజింతుము ||2||
కల్వరి రుధిర ధారలు భువిపై ప్రవహించగా
పాపుల రక్షణకై ప్రభు యేసు జీవ బలిగా
త్యాగం ప్రాణం ఆత్మతో ఆరాధింతుము
నిత్యం నిరతం పావన ఆత్మను పాడెదము ||రండి||

No comments: