Saturday 17 February 2018

Kuripinchu Maapai Nee Jeevajalamu Song Lyrics

కురిపించు మాపై నీ జీవజలము

పల్లవి:        కురిపించు మాపై నీ జీవజలము – ప్రోక్షించు మాపై పావన జలము
              పాపాంధకారములో పడియుంటిని – మన్నింపు కోరి శరణంటిని
              క్షమియించవా – కరుణించవా – క్షమియించి కరుణించి దరిచేర్చవా||2||

1.             భూలోక వాంఛలకు బంధీనైతిని – బాప్టిజ వాగ్ధానం మరచితిని ||2||
ఇహలోక జీవితమే శాశ్వతమని బ్రమసి – నీ దివ్యప్రేమకు దూరమైతిని
క్షమియించవా – కరుణించవా – క్షమియించి కరుణించి దరిచేర్చవా ||2||

2.            అపవాది ప్రేరణకు బానిసనైతిని – విశ్వాస ప్రమాణాలు వీడితిని ||2||
          నా జీవమార్గము నీవేనని తెలిసి – నీ దివ్య సన్నిధి కోరుచుంటిని 
          క్షమియించవా – కరుణించవా – క్షమియించి కరుణించి దరిచేర్చవా ||2||

No comments: