పూజకు పూవులు కోసుకొని
పల్లవి: పూజకు పువ్వులు కోసుకొని – నీ మెడలో మాలగ
వేయ్యాలని ||2||
నీ ఒడి అందుకోవాలని – నీ గుడి ముందే
నిలచితిని
దేవా... కోవెల తలుపులు తీయవా
దేవా... దరిశన
వరమును ఇయ్యవా ||పూజ||
1. ప్రాణం పోసిన పరమాత్మ – పాదపూజకు పిలిచావా
పేదల పాలిటి పెన్నిధి – ప్రేమను పంచగ
వచ్చితివా
దేవా... కోవెల తలుపులు తీయవా
దేవా... దరిశన
వరమును ఇయ్యవా ||పూజ||
2. నీ మాటలే నావేదం – నీ తోటలే నా
స్వర్గం
చీకటి బ్రతుకున వెన్నెలై – మనుగడ పున్నమి
చేసితివి
దేవా... కోవెల తలుపులు తీయవాదేవా... దరిశన వరమును ఇయ్యవా ||పూజ||
No comments:
Post a Comment