Saturday 17 February 2018

Naatho Maatlaadumayyaa Song Lyrics

నాతో మాట్లాడుమయ్యా

పల్లవి:      నాతో మాట్లాడుమయ్యా – నన్ను దర్శించుమయ్యా
            నీ మందిరాన నీ సన్నిధాన – నీ ఆత్మతో నన్ను నిమ్పుమయ్యా ||నాతో||
            యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా / యేసయ్యా... యేసయ్యా...

1.                కన్నీళైన – కష్టాలెదురైనా – కడవరకు – నను చేర్చుమయ్యా
కరువుతోడైన – కలిమి వేరైనా – కరుణించి కాపాడుమయ్యా
నా వేదనలో – నీ జాలితో – నా శోధనలో – నీ చేతితో
నిత్యము నను నడిపించుమయ్యా ||యేసు||

2.              నావారెనన్ను – నిదించువేళ – నన్ను విడిచిపోబోకుమయ్యా
ఆదరణ నాకు కరువైన వేళ – దరిచేరి ఓదార్చుమయ్యా
నా నిందలలో – నా తోడువై – అపనిందలలో – నా చేరువై
నిత్యము నను – నడిపించుమయ్యా ||యేసు||

3.              నా కాలుజారి – తోట్రిల్లు వేళ – చేయిజాచి నిలబెట్టుమయ్యా
సాతాను నన్ను బంధించు వేళ – నను చేరి విడిపించుమయ్యా
నీ చేతితో ననుపట్టుకో – నిత్యము నను నడిపించుమయ్యా ||యేసు||

No comments: