బలిపూజలో పాల్గొన వేగమే
పల్లవి: బలిపూజలో పాల్గొన వేగమే రారండి జనులారా ||2||
ప్రభుదీవెన పొందగ వేగమే రారండి
ప్రియులారా ||2||
ఇది దైవసుతుని త్యాగం – మన పాప పరిహారార్ధం
ఒసగిన దేవుని ప్రేమ బలిదానం
1. సమత మమతల కోసం – శాంతిస్థాపన కోసం
దేవుడే మానవుడై అవతరించెను – దీనులను హీనులను
కనికరించెను
పూజింపరారే స్తుతియించరారే – సేవింపరారే దేవాది
దేవుని
పూజలో పాల్గొని నవజీవం పొందరే
||బలి||
2. మానవ రక్షణ కోసం మనుజాళి మనుగడ
కోసం
తన ప్రాణం తన సర్వం త్యాగం చేసెను
ప్రేమాజ్ఞను పాటింపగ గురుతులు
ఇచ్చెను
పూజింపరారే స్తుతియించరారే – సేవింపరారే దేవాది
దేవుని
పూజలో పాల్గొని నవజీవం పొందరే
||బలి||
No comments:
Post a Comment