Friday 16 February 2018

Yesayyaa Naa Priya Prabhuvaa Song Lyrics

ఏసయ్యా నా ప్రియ ప్రభువా (సాగర స్వరం సిడి)

పల్లవి:        ఏసయ్యా నా ప్రియ ప్రభువా - కరుణామయా నను బ్రోవుమయ్యా ||2||
ఎన్ని సార్లు నీ సన్నిధి విడచి వెళ్ళిన ||2||
నను మన్నించి మనస్సుమార్చి ప్రేమను పంచావు
పవిత్ర పరచావు పరిశుద్దుని చేశావు ||2|| ||ఏసయ్యా||

1.               ఆదాము అవ్వలు నీఆజ్ఞను మీరినను
       అనంత ప్రేమతో నీవు కరుణించావు ||2||
బలహీన సమయంలో పాపంలో పడనీయక
బలపరచి ధైర్యమిచ్చి కృపచూపుమయా ఓ కరుణామయా
ఏసయ్యా కాపాడవా కరుణించవా నీ కృప చూపవా ||2||

2.            తండ్రి ప్రేమ లెక్కించని దుడుకు చిన్న వానిని 
       ఆదరించి ప్రేమతో కరుణించావు ||2||
నీ ప్రేమను మరచి స్వార్ధంతోవున్న మమ్ము
బలపరచి ధైర్యమిచ్చి కృపచూపుమయా ఓ కరుణామయా
ఏసయ్యా కాపాడవా కరుణించవా నీ కృప చూపవా ||2||

No comments: