Saturday 17 February 2018

Daivamaa Ee Paapinee Song Lyrics

దైవమా ఈ పాపినీ

పల్లవి:        దైవమా ఈ పాపినీ – చేరదీసి క్షమియించుమా ||2||
              నిన్ను విడచి – నీ ప్రేమ మరచి ||2|| 
              శిధిలమైతిని – చెంత చేరితిని ||దైవ||

1.                నీ శ్వాసనిచ్చి నను చేసినావు – నీ గుండెలోన నను దాచినావు ||2||
బలహీనుడనై బహు ఘోర పాపినై ||2|| 
నా పాప మెరిగితిని చెంత చేరితిని ||దైవ||

2.            (నీ) అరచేతిలోన నా పేరు చెక్కి – నీ కంటి పాపలా కాపాడినావు ||2||కలుషాత్ముడనై కడుఘోర పాపినై ||2|| 
       శరణు వేడితిని చెంత చేరితిని ||దైవ||

No comments: