Friday 2 February 2018

Rammanuchunnaadu Ninnu Prabhu Yesu Song Lyrics

రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు

పల్లవి:        రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు
వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు ||2||
ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని ||2||
గ్రహించి నీవు యేసుని చూచిన - హద్దు లేని ఇంపు పొందెదవు ||2|| 
||రమ్మను||

1.              కన్నీరంతా తుడుచును కనుపాపవలె కాపాడున్ ||2||
కారు మేఘమువలె కష్టములు వచ్చిననూ
కనికరించి నిన్ను కాపాడును   
 ||2|| ||రమ్మను||

2.              సోమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును ||2||
ఆయన నీ వెలుగు రక్షణనై యుండును
ఆలసింపక త్వరపడి రమ్ము
        ||2|| ||రమ్మను||

    3.     సకల వ్యాధులను స్వస్థత పరచుటకు ||2||
            శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో
            అందరికి తన కృపలనిచ్చున్
 ||2|| ||రమ్మను||

No comments: