Friday 16 February 2018

Enno Ellu Jeevinchinaa Song Lyrics

ఎన్నో ఏళ్ళు జీవించినా

పల్లవి:        ఎన్నో ఏళ్ళు జీవించినా – నీ కృపలేనిదే అది ఫలియించునా
              ప్రభో నీ కృపలేనిదే – అది పుష్పించునా

         1.     దారి తెన్నుకానరాని – దుర్దిన సమయంలో
       దయతోడ చేయిపట్టి – నడిపించావే
       నాకన్నీటితో నిన్ను ప్రార్థించగ – నా కన్న తండ్రివై నీవు నిలిచావే
ఎలా మరువను తండ్రీ నీ ప్రేమను -ఎలా పొగడను తండ్రీ నీ కరుణను ||ఎన్నో||

       2.    నా జీవిత మలుపునందు – బలహీనతయందు
     ఆత్మతో బలపరచి – దీవించినావే
     నీ ప్రేమతో నీ కరుణతో – నీ త్రోవలో నడిపావే
     ఎలా మరువను తండ్రీ నీ ప్రేమను -ఎలా పొగడను తండ్రీ నీ కరుణను ||ఎన్నో||

No comments: