Thursday, 1 February 2018

Neekumaarugaa Nannu Malachina song lyrics

నీకుమారుగా నన్ను మలచిన

పల్లవి:       నీకుమారుగా నన్ను మలచిన - శాశ్వత స్నేహితుడా
                 ఆత్మ ఆలనతో ఆదరించిన నా ప్రియ హితసుతుడా ||2||
                 పూజలు గైకొనుమా దయతో నను గనుమా ||2||

1.              నీవులేక నే లేనే లేనని తలచిన శుభ సమయాన
 పూజా వేళలో నీ సన్నిధిలో తరింప చేరితి స్వామి  ||2||
 స్వీకరించు దయతో నా స్తుతి ప్రార్థన       ||2||
 పూజలు గైకొనుమా దయతో నను గనుమా ||2||

2.             పేరుతో నన్ను పిలిచిన వేళ నీలో నడిచితి దేవా
కొదువలేని నీ ప్రేమను పొంది యాజక భాగ్యము నొందితిని  ||2||
స్వీకరించు దయతో నా స్తుతి ప్రార్థన        ||2||
             పూజలు గైకొనుమా దయతో నను గనుమా  ||2||

No comments: