Saturday 17 February 2018

Naaku Aadhaaram Neevenayyaa Song Lyrics

నాకు ఆధారం నీవేనయ్యా

పల్లవి:        నాకు ఆధారం నీవేనయ్యా – నా ఆరాధన నీకేనయ్యా
              నిన్ను వదలి నేను ఉండలేనయ్యా ||2||
              నిన్నే నేను నమ్మితి యేసయ్యా ||2||

1.                గాలిని ఇచ్చినది నీవే – గగనాన్ని చేసినది నీవే ||2||
నీటిపైన నడచినది నీవే ||2|| - నిత్యం కాపాడునది నీవే ||2||
నిన్ను వదలి నేను ఉండలేనయ్యా ||2||
నిన్నే నేను నమ్మితి యేసయ్యా ||2||

2.               ప్రాణము పోసినది నీవే – పరిశుద్ద నింపినది నీవే ||2||
యాజకునిగ మార్చినది నీవే ||2||
ఎడబాయక కాచునది నీవే ||2|| ||నిన్ను||

3.              ముందుండి నడుపునది నీవే (నా) – కుడి ప్రక్కన నిలచునది నీవే ||2||జీవ జలము ఇచ్చునది నీవే ||2||
       జీవింప చేయునది నీవే ||2|| ||నిన్ను||

No comments: