Friday 9 February 2018

Andhakaara Velalo Song Lyrics

అంధకార వేళలో

పల్లవి:        అంధకార వేళలో హృదయాంతరాత్మను
              ప్రభుని ప్రేమ కిరణములే మధురముగా తాకింది ||2||

1.               మధురాతి మధురమైన ఆ ప్రేమ స్వరమే
సూర్యకిరణం వోలే మంచు బిందువోలే ||2||
తేట తెల్లనైనది నా ప్రభుని ప్రేమయే ||2|| ||అంధకార||

2.                   పరమపిత ప్రేమరూప ప్రభు క్రీస్తు ప్రేమనాధ
మనస్సు నందు నింపినది – నా హృదిని తాకింది ||2||
పరవశించి పాడనా నా యేసు నామమే ||2|| ||అంధకార||

1 comment:

Unknown said...

need that song plz
searching for long time