దేవుని పూజకు వేళాయెరా
సాకి: దివ్య ప్రకాశ శ్రీకరదేవా - సర్వమంగళ శుభకర నేత
సుందర ధరణియే నీ
ప్రియవాసం - పరిపూర్ణతయే నీ ప్రియధ్యానం
జగమును బ్రోవుము - సద్గుణద్దామా
సద్గుణద్దామా సద్గుణద్దామా
సాస పాపపప మపమనిపమరి సమరిసాని రీరిరీరిరిరి
సాస పాపపప మపమనిపమరి సమరిసాని
సాససాససస
పల్లవి: దేవుని పూజకు వేళాయెరా - ఆశ్రిత జనులను కరుణించురా ||2||
ప్రేమాన్వితుడు సద్గుణరూపుడు
కారుణ్యదాముడు ||2||
పూజలో పాల్గొందమూ స్తుతియించి
ప్రణుతింతుము ||2|| ||దేవుని||
1.
సృష్టిని
చేసిన పావన దైవం - నరునికి ఒసగెను తన దివ్యరూపం ||2||
జీవపుకాంతులు
ప్రసరింప జేసి - ఇలలో స్వర్గము కనువిందు జేసెను||2||
నిసరిమరీ
రిమపనిపా మపనిస పనిసరి రీరిసని పమరిమరీ ||దేవుని||
2. పుడమిని
శాంతిని కోరిన దైవం - తన ప్రియకొమరుని ప్రేమతో పంపెను ||2||
సిలువలో
రుధిరం చిందిన యేసు మనిషికి స్వర్గం ప్రభవింప జేసెను ||2||
నిసరిమరీ రిమపనిపా మపనిస - పనిసరి
రీరిసని పమరిమరీ ||దేవుని||
No comments:
Post a Comment