Saturday 17 February 2018

Cheekati Loyalo Baadhala Daarilo Song Lyrics

చీకటి లోయలో బాధల దారిలో

పల్లవి:        చీకటి లోయలోబాధల దారిలో శోకపు సుడులలో వేదన బాధలో ||2||
              ప్రార్థిస్తూ మోర పెడితే ధ్యానిస్తూ నీవు పయనిస్తే
              యేసయ్యా తోడుగా నిలుచును నీ పక్షముగా  ||2|| ||చీకటి||

1.                భూమికి సూర్యకాంతి అవసరమగురీతిగా ||2||
క్రీస్తుని మోము వెలుగు మనకవసరమేకదా ||2||
నిత్య జీవ బాటలో సాగాలని కాంక్షిస్తూ
ప్రార్థిస్తూ.. మొరపెడితే.. ధ్యానిస్తూ నీవు పయనిస్తే
యేసయ్యా తోడుగా నిలుచును నీ పక్షముగా  ||2|| ||చీకటి||

2.                జీవికి ప్రాణవాయువు అవసరమగు రీతిగా
        క్రీస్తుని దివ్యవాక్కు మనకవసరమేకదా ||2||
          విసుగును విసర్జించి ఆసక్తిని ధరించి
        నిత్య వాక్య ధ్యానములో గడపాలని కాంక్షించి ||2||

1 comment:

Unknown said...

One line is missing 1st charam 3rd line thank u