Saturday 17 February 2018

Neevu Leni Naa Jeevithaaniki Song Lyrics

నీవు లేని నా జీవితానికి

పల్లవి:    నీవులేని నా జీవితానికి అర్ధమే లేదని తెలుసుకోనైతిని ||2||
           లోకాశలు క్షణికమైనవి – తెలిసినంతలో శూన్యమై పోతిని ||2||
           ఆదరించుమా నజరేయుడా – ఓదార్చుమా నీతి సూర్యుడా ||2|| ||నీవు||

1.                 గాలి తగిలి ఎగిరిపోవు పొట్టు వంటి ఆశతో
        ఈ లోక సంపదకై తహతహలాడితిని ||2||
నిజ సంపద నీవని తెలుసుకున్నంతలో
మంచువలే నేను మరుగైపోతిని ||2||
ఆదరించుమా నజరేయుడా – ఓదార్చుమా నీతి సూర్యుడా ||2|| ||నీవు||

2.            సంద్రపు నురగలా చెదిరిపోవు పేరుకై – అడ్డదారిలో నేను పయనమైపోతిని
       నీ చేతిలో చిక్కిన పేరునని మరచి
       ఒక్కరోజు అతిధిలా మాసిపోతిని ||2|| ||నీవు||

No comments: