Friday 2 February 2018

Swaagatham Suswaagatham Poojya Guruvaa Song Lyrics

స్వాగతం సుస్వాగతం పూజ్య గురువా

పల్లవి:       స్వాగతం సుస్వాగతం - పూజ్య గురువా స్వాగతం
                పూజ చేయను స్వాగతం ||2||

1.              ప్రభుని నామము ప్రస్తుతించు ప్రజల తోడను చేరియుంటిని
పాపమెల్లను పరిహరింపను పరమ తండ్రిని వేడగన్
పూజ గురువా ప్రేమ నేర్పే ప్రేమతో జీవింపన్ ||స్వాగతం||

2.             సుధలు పలికే మధుర నామం ప్రభువు యేసుని దివ్య నామం
కావ్యమైన కంఠముతో నవ్యగానము చేయుచున్
             కలుషములనే పారద్రోలిన కల్వరి బలి పూజకు ||స్వాగతం||

No comments: