Thursday, 1 February 2018

Paravasha Hrudayamutho Devaa Cherithi Song Lyrics

పరవశ హృదయముతో దేవా చేరితి

సాకి:           పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠమున్
                   హే యాజకాగ్రేశ్వరా పాపహరా
                   ఇహపరలోక నిత్యాధిపతి సకలమానవ రక్షణ దాత
                   యేసు క్రీస్తు ప్రభో... నమస్తే... నమస్తే... నమస్తే...

పల్లవి:  పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠమున్ దేవా చేరితి నీ సేవకై ||2||
          స్వామి పిలుపుల గంటలు మ్రోగ మాదు హృదయములు పులకించెనుగా ||2||
          యేసు బిడ్డలను దీవించగను వేగమె రావయ్య మమ్మును దీవించవా ||పర||

1.     మమతలు నిండిన పులకిత మనస్సుల మధుర సరాగము పలికిన వేళలో
      మరియనందన నీ ప్రియ పిలుపుకు బదులుగ నేనే వచ్చితి స్వామి ||పర||

2.        నీ సేవలనే నిరతము చేయగ మలచితివీ నను నీ పరికరముగ
           జననీ జనకుల దీవెనపొంది ||2|| నీ దరి చేరితి నా ప్రాణప్రియుడా ||పర||

No comments: