Saturday 17 February 2018

Thalachukunte Chaalunu O Yesu Song Lyrics

తలచుకుంటే చాలును ఓ యేసు

పల్లవి:        తలుచుకుంటే చాలును ఓ యేసు నీ ప్రేమ
              జల జల జల జారును కృతజ్ఞతాకన్నీరు
              తలుచుకుంటే చాలును కరిగించును రాళ్ళను
              కల్వరి స్వరము ఇది కల్వరి స్వరము

1.               నీ మోమున ఊసిన ఉమ్ములు – నా మోహపు శుద్ధి చేసెను
నీ చెంపను కొట్టిన దెబ్బలు – నా నోటిని శుద్ధి చేసెను ||2||
నీ శిరస్సున గుచ్చిన ముళ్ళు – నా మోసపు తలపును త్రుంచెను ||2||
ఎంత త్యాగ పూరితమో నీ ప్రేమ – ఎంత క్షమా భరితమో నీ ప్రేమ ||తల||

2.                  నీ దేహము చీరిన కొరడా – నా కామమును చీల్చెను
నీ చేతుల కాళ్ళకు మేకులు – నా చీకటి దారి మూసెను ||2||
నీ సిలువ నెత్తుటి దారలు నా కలుషమును కడిగి వేసెను ||2||
ఎంత త్యాగ పూరితమో నీ ప్రేమ – ఎంత క్షమా భరితమో నీ ప్రేమ ||తల||

No comments: