Thursday, 1 February 2018

Ninu Cheragaa Ninu Koluvagaa Song Lyrics

నిను చేరగా నిను కొలువగా

సాకి:            ధవళ సింహాసనమునకు అధిపతియైన సర్వేశ్వరా
పిత పుత్ర పవిత్రాత్మల అనుబంధమా
అందుకొనుమా మాదు ప్రణతులు
నీకివే మా ప్రణతులు... ప్రణతులు ||3||

పల్లవి:      నిను చేరగా నిను కొలువగా 
                 నా హృదయం పద్మమువలె వికసించిపోగా ||2||
                 సస సనిదనిదప సా మప మగ సనిని
                 సదా నీ పూజలో నే లీనమవ్వగా దరిశన మియ్యవా దీవెనలిడుమా||2||
||నిను||

1.               పిత పుత్ర పవిత్రాత్మ ప్రతిరూపిదియే 
          ప్రేమ తీర ప్రియపుత్రుని బలియాగ మిదియే ||2|| 
పీడితులందరికి ముక్తిని కలిగింతునని
పలికి నడిచి నడిపిన నజరేయుడా ||2||
రండి పాల్గొందము రండి రక్షణ పొందుదము ||2||      ||నిను||

2.              సహవాస మొనరించు బలిపీఠమిదియే
         సర్వమానవాళికి సంజీవి శిలువయే ||2||
కరుణకు ఈ బలియే కారుణ్య రూపము
కరము శిరము మలచి నినుకొలిచెదము
             రండి పాల్గొందము రండి రక్షణ పొందుదము ||2||        ||నిను||

No comments: