Saturday 17 February 2018

Chaalunayaa Chaalunayaa Song Lyrics

చాలునయా చాలనుయా
 
పల్లవి:          చాలునయా చాలునయా - నీ కృప నాకు చాలునయా ||2||
                ప్రేమామయుడవై ప్రేమించావు - కరుణామయుడవై కరుణించావు ||2||
                తల్లిగా లాలించి - తండ్రిగా ప్రేమించు ||2||
                ప్రేమ కరుణ - నీ కృప చాలు ||2||     ||చాలునయా||

1.        జిగటగల ఊబిలో పడియుండగా - నా అడుగులు స్థిర పరచి నిలిపితివయ్య ||2||
 ఇస్సోపుతో నన్ను కడుగుము యేసయ్య – హిమము కంటెను తెల్లగ మార్చయ్య
 నీకేమి చెల్లింతును నామంచి యేసయ్య – నాజీవిత మంతా అర్పింతు నీకయ్య
 ప్రేమ కరుణ నీ కృప చాలు ||2|| ||చాలు||

2.            బంధువులు స్నేహితులు తీసివేసినా – తల్లి తండ్రులే నన్ను వెలివేసినా
నన్ను నీవు విడువను లేదయ్యా – మిన్నగా ప్రేమించి రక్షించినావయ్య
నీకేమి చెల్లింతును నామంచి యేసయ్య
నీ సాక్షిగా నేను ఇల జీవింతునయ్య
ప్రేమ కరుణ నీ కృప చాలు ||2|| ||చాలు||

No comments: