Friday 2 February 2018

Premaku Nelavu Mana Devuni Koluvu Song Lyrics

మ్రోగుచున్నవీ గుడి గంటలు

సాకి:    మ్రోగుచున్నవీ గుడి గంటలు వినరే... రారే... ప్రియ సంఘమా...

పల్లవి:  ప్రేమకు నెలవు మన దేవుని కొలువు ఆమని పిలువు మన దేవుని పిలుపు
           వడి వడి నడకల సరియగు విధమున
          యేసుని చెంతకు రారే ప్రేమను పొందను.. మన ||2||
          చంద్రోదయం... ప్రేమ చంద్రోదయం
          చంద్రోదయం.. దైవ ప్రేమ చంద్రోదయం..

1.               నీతి వస్త్రము నీవు ధరించుము యేసుని చూడగను
నిండు మనస్సుతో నీవరుదెంచుము యేసుని కొలువగను.. ||2||
ధవళ వస్త్రమున దూత బృందమున దేవ దేవుడు దేవుని పుత్రుడు
దిగిరానున్నాడు నింగినుండి దిగిరానున్నాడు
అభినందనం.. దేవా అభినందనం
అభినందనం.. యేసువా అభినందనం ||ప్రే||

2.               ఆదివారము మన ప్రభు దినము మరువకు సోదర (సోదరీ)
అనుదిన ప్రార్థన ఆ ప్రభు మెచ్చును దీవెన లిచ్చునులే... ||2||
ఆలయ గంటలు మ్రోగుచున్నవీ... అదిగదిగో దేవుని పిలుపు
రమ్మనుచున్నాడు.. యేసు నిన్ను రమ్మనుచున్నాడు
అరుణోదయం ప్రేమ అరుణోదయం అరుణోదయం యేసు ప్రేమ అరుణోదయం

No comments: