పండుగ ఉత్సవ పూజా వేళ
పల్లవి: పండుగ ఉత్సవ పూజా వేళ – పరమోన్నతుని పద
సన్నిధికి ||2||
స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో
||2||
పరుగున రండు ప్రభు జనమా – త్వరపడి రండి ప్రియ
జనమా ||2||
రారండీ వేడండీ ప్రభు దీవెన
పొందండి
ఆడండి పాడండి ప్రభు ప్రేమను పొందండి ||పండుగ||
1. రాజరికపు గురుకులమని యనుచు
శుభదేవునికి ప్రియ జనమనుచు ||2||
ప్రేమతో ఎంపిక చేసిన ప్రియునికి – స్తుతులర్పించగ
రారండి ||2||
||పండుగ||
2. మొరవిని కరుణగ గాంచె రాజని – అందరిని దరిచేర్చే
ప్రభువని ||2||
కృతజ్ఞతా భావము కలిగి – పీఠము చెంతకు చేరండి ||2|| ||పండుగ||
No comments:
Post a Comment