Thursday, 1 February 2018

Paravasha Mondaga Keerthinchedamu song lyrics

పరవశ మొందగ కీర్తించెదము

సాకి:         సర్వలోక పాలకా సత్య దేవ తనయుడా
                నిత్య తేజో విరాజితా సుమధుర చరితా నమస్తే నమో నమః
                
                సరిగ సరిగ సరిగ సరిగ సరి - రిగమ రిగమ రిగమ రిగమ రిగ
                గమప గమప గమప గమప గమ సాస నీని దాద పాప మగరిస

పల్లవి:        పరవశ మొందగ కీర్తించెదము - పావన యేసుని ఈ బలి పూజలో
                   పాడి స్తుతించి భజియింతు స్వామిని కల్వరి నాథుని ఈ శుభవేల

1.           మమతల మూర్తి మన ప్రభు యేసుని మహిమలు పాడి స్తుతులర్పింతుము
పాపము శోకము భారము తీర్చిన మహిమాన్వితుని కొనియాడెదము 
||పరవశ||

2.        భక్తితో పూజలో పాల్గొని మన హృదయ దీపాలు వెలిగించెదము
           భయమును బాపి భద్రత కూర్చెడి మంజుల మూర్తిని కొనియాడెదము 
||పరవశ||

No comments: